ఫైనల్ గా టిల్లు స్క్వేర్ లో అనుపమ..!?
లాస్ట్ ఇయర్ వచ్చిన “డీజే టిల్లు” సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. విమల్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాతో తనలోని మల్టీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు ఈ హీరో. అప్పటివరకు సైడ్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తూ వచ్చిన సిద్ధు ఫైనల్ గా “డీజే టిల్లు”తో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి డీజే టిల్లు సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు.
ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ గా “టిల్లు స్క్వేర్” అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ కు డైరెక్టర్ ని మార్చేశారు. ప్రెజెంట్ మల్లిక్ రామ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్దు సరసన నటించడానికి ముందు హీరోయిన్ గా అనుపమ ని అనుకున్నారని తెలిసిన సంగతే. కానీ, ఆమె ఎందుకో సినిమా నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత శ్రీలీల కూడా టిల్లు స్క్వేర్ లో నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆమె కూడా ఎందుకో సినిమా చేయనని చెప్పేసిందట.
చాలా డిస్కషన్స్ తర్వాత ఫైనల్ గా టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ గా సిద్దు జొన్నలగడ్డతో జత కట్టడానికి అనుపమ ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని అనుపమ పరమేశ్వరన్ తన సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేసింది. టిల్లు స్క్వేర్ లో నటిస్తున్నట్టుగా ఆమె ఇన్ స్టాగ్రాంలో కర్లీ హెయిర్ గురించి ఒక వీడియో పెట్టింది. టిల్లు స్క్వేర్ సెట్ లో తిరిగి జాయిన్ అయినట్టు ఆ వీడియోతో కన్ఫర్మ్ చేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ వీడియోలో అనుపమ ని చూసి ఆమె ఫాన్స్ తెగ సంబర పడిపోతున్నారట.













