హెలెన్ రీమేక్ లో అనుపమ?
గత ఏడాది మలయాళంలో వచ్చిన హెలెన్ చిత్రం విమర్శకుల ప్రశంసల్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధించింది. ఓ మాల్లోని చికెన్ హబ్‌లో పనిచేసే నర్సింగ్ విద్యార్థిని అనుకోని పరిస్థితుల్లో కోల్డ్‌స్టోరేజీలో చిక్కుకుపోతుంది. ఓ వైపు మృత్యువు కబళించే క్షణాలు సమీపిస్తుంటే ఆ యువతి ప్రాణరక్షణకై చేసిన పోరాటం నేపథ్యంలో మానవీయ ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని వివిధ భారతీయ భాషల్లో పునర్నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రీమేక్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. పీవీపీ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి నిర్ధేశక బాధ్యతల్ని కొత్త దర్శకుడు చేపట్టబోతున్నాడని సమాచారం. హెలెన్ సినిమాలోని హృదయాన్ని స్ప•శించే భావోద్వేగాలు, మానవీయ కోణం ఆకట్టుకోవడంతో ఈ సినిమాలో నటించేందుకు అనుపమ పరమేశ్వరన్ సంతోషంగా అంగీకరించిందని చెబుతున్నారు. రాక్షసుడు తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ నటించలేదు అనుపమ పరమేశ్వరన్.













