రూట్ మార్చిన అనుపమ
అ..ఆ సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైన మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ మొదట్లో పక్కింటి అమ్మాయి లుక్స్ తో ఆడియన్స్ ను అలరించంది. కానీ ఇప్పుడీ భామ తనను తాను కంప్లీట్‌గా ఛేంజ్ చేసుకుంది. తను మొదట్లో చేసిన సినిమాలతో ముద్దుగా కనిపించిన అనుపమ అప్పట్లో స్కిన్ షో కు దూరంగా ఉంది.
కానీ చిత్ర పరిశ్రమలో రాణించాలంటే ఇలా ఉండటం సరిపోదనుకున్న అనుపమ స్లిమ్ గా మారి తన గెటప్‌ను మార్చేసి, గ్లామర్ షో కి రెడీ అయిపోయింది. రీసెంట్గా టిల్లు స్వ్కేర్ సినిమాలో నటిస్తున్న అనుపమ ను చూసి అందరూ షాకవుతున్నారు. టిల్లు స్వ్కేర్ సినిమా నుంచి తాజాగా రిలీజైన ప్రోమోలో అమ్మడు గ్లామర్ షో చూసి ఫ్యాన్స్ కుర్రాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.
మొత్తానికి వాస్తవాన్ని త్వరగా తెలుసుకున్న అనుపమ గ్లామర్ గేట్స్ ఎత్తేసిందనే చెప్పాలి. అందుకే సోషల్ మీడియాలో కూడా అనుపమ యూత్‌ని టార్గెట్ చేసి మరీ గ్లామర్ షో చేసేలా ఫోటోలను అప్లోడ్ చేస్తుంది. అనుపమ టిల్లు స్క్వేర్ సినిమాతో పాటూ రవితేజ ఈగల్ సినిమాలో కూడా నటిస్తుంది. అనుపమ తన ఆశలన్నింటినీ టిల్లు స్క్వేర్ పైనే పెట్టుకుంది.













