అనుదీప్ ప్రూవ్ చేసుకోవాల్సిందే!
ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా డైరెక్టర్ అనుదీప్ తీసిన జాతి రత్నాలు సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయిందో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ చూసి తమిళ హీరో శివ కార్తికేయన్, అనుదీప్ కు పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. కానీ అతనితో అనుదీప్ చేసిన ప్రిన్స్ మూవీ అనుకున్న రేంజ్ లో ఆడలేదు. ఇక అసలు విషయానికొస్తే, అనుదీప్ ఇప్పుడు తన రూట్ మార్చి మాస్ రూట్ పట్టబోతున్నాడు.
మాస్ మహారాజా రవితేజకు అనుదీప్ ఓ స్టోరీ చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రవితేజ బర్త్ డే సందర్భంగా జనవరి 26న అఫీషియల్ గా అనౌన్స్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం కొన్ని నెలల కిందటే సితార బ్యానర్ ఆమెకు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మాస్ మహారాజాతో అనుదీప్ చేయబోతున్న సినిమా అతనికో పెద్ద ఛాలెంజ్. మొన్నటికి మొన్న వెంకీతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్ అయిపోయింది. స్క్రిప్ట్ విషయంలో వెంకటేష్ శాటిస్ఫై కాకపోవడం వల్లే సినిమా ఓకే కాలేదని టాక్. జాతిరత్నాలు2 తీద్దామనుకుంటే నవీన్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అదీ ఆగిపోయింది. కాబట్టి రవితేజ సినిమాతో సక్సెస్ అందుకుంటే మళ్లీ అనుదీప్ ట్రాక్ లోకి వచ్చేయొచ్చు.













