మరోసారి సమంతను టార్గెట్ చేసిన యాంటీ ఫ్యాన్స్
నాగచైతన్యతో విడాకులు తీసుకుని విడిపోయాక తన కెరీర్ ను ఎంతో ప్లాన్డ్ గా ముందుకు తీసుకుని వెళ్తుంది సమంత. రీసెంట్గా శాకుంతలంతో గట్టి ఎదురుదెబ్బ తిన్న సామ్, ఆ సినిమా రిజల్ట్ ని లైట్ తీసుకున విదేశాలకు చెక్కేసింది. రీసెంట్గా సిటాడెల్ వెబ్ సిరీస్ షూట్ కోసం సైబీరియా వెళ్లిన సామ్, అక్కడ ఓ పబ్లో చాలా హుషారుగా కనిపించింది.
అంతేకాదు, ఆ పబ్ లో పుష్ప మూవీలోని ఊ అంటావా సాంగ్ కు ఎంతో ఎనర్జిటిక్ గా డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో సమంత యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. యశోద, శాకుంతలం ప్రమోషన్లలో తనకొచ్చిన జబ్బు పేరు చెప్పి సింపతీ కార్డ్ ప్లే చేసిన సమంతకు విదేశాలు వెళ్లగానే ఎక్కడలేని ఎనర్జీ ఎక్కడనుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
తన సినిమాలను అందరూ థియేటర్లకు వచ్చి చూడాలని ఇలా పదే పదే ఒకటే సింపతీ కార్డ్ ప్లే చేయడం వర్కవుట్ అవదని సమంతకు కౌంటర్లు ఇస్తున్నారు. వాస్తవానికి సమంత యశోద, శాకుంతలం టైమ్ లో తన ఆరోగ్యం పరంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడింది. అది తన ముఖంలోనే తెలిసిపోయింది. కానీ తర్వాత సిటాడెట్ షూటింగ్లో అలాంటివేం లేకుండా తనను తాను ఫుల్ ఛార్జ్ చేసుకుని ఎనర్జిటిక్ గా మారింది.
దీన్ని యాంటీఫ్యాన్స్ ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. ఎలాగైతేనేం సమంత సెప్టెంబర్ లో రిలీజ్ కాబోయే ఖుషి సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు ఎవరొకరి ద్వారా ఈ ప్రశ్న సమంతకు ఎదురుకాకుండా ఉండదు, తన రేంజ్లో సమంత ఆన్సర్ ఇవ్వకుండా పోదు అని సమంత ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ కు రిప్లైలు ఇస్తున్నారు. మరి సమంత ఈ ప్రశ్నలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.













