Anshu: ఇంటిపేరు విషయంలో క్లారిటీ ఇచ్చిన అన్షు
నాగార్జున(Nagarjuna) హీరోగా విజయ్ భాస్కర్(Vijay Bhaskar) దర్శకత్వంలో వచ్చిన మన్మథుడు(Manmadhudu) సినిమాకు ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. త్రివిక్రమ్(Trivikram) కథ, మాటలు అందించిన మన్మథుడు సినిమాలో సోనాలీ బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించారు. అయితే సినిమాతో తెలుగు ఆడియన్స్ గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నదంటే అన్షు(Anshu)నే. సినిమాలో తన పాత్ర కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో మంచి ముద్ర వేయగలిగింది.
తర్వాత ప్రభాస్(Prabhas) తో కలిసి రాఘవేంద్ర(Raghavendra) సినిమాలో నటించింది. ఆ తర్వాత అన్షు మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. లండన్ వెళ్లి అక్కడి బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైపోయింది. మన్మథుడు రీరిలీజ్ సందర్భంగా ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న మజాకా(Mazaaka) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మజాకా ప్రమోషన్స్ లో భాగంగా అన్షు తన ఇంటిపేరు గురించి స్పందించింది. అన్షు గురించి గూగుల్ లో వెతికితే ఆమె పేరు అన్షు అంబానీగా గూగుల్ లో కనిపిస్తుంది. మరి అన్షు నిజంగా అంబానీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తేనా అని అడిగితే, తనకు అంబానీ కుటుంబానికీ ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. గతంలో ఒక రిపోర్టర్ చేసిన పని వల్ల ఇప్పటికీ తన పేరు అన్షు అంబానీలానే ఉండిపోయిందని చెప్పింది.













