రీఎంట్రీ ఇవ్వనున్న నాగ్ హీరోయిన్
ఎప్పుడో 20 ఏళ్ల కిందట వచ్చిన మన్మథుడు సినిమాకు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే మొన్నీ మధ్య రీ రిలీజ్ చేసినప్పుడు థియేటర్లంతా మోత మోగిపోయాయి. మన్మథుడు నాగ్ యాక్టింగ్, త్రివిక్రమ్ రైటింగ్ తో పాటూ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అను పాత్ర కూడా అందరికీ బాగా గుర్తుండిపోయింది. అన్షు నిడివి సినిమాలో కాసేపే అయినా, ఉన్నంతసేపు తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. మన్మథుడు తర్వాత రాఘవేంద్ర సినిమాలో మెరిసిన అన్షు ఆ తర్వాత విదేశాల్లో సెటిలైపోయింది.
ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అన్షు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్ హీరోగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అన్షును రావు రమేష్ కు ప్రియురాలిగా రీఎంట్రీ ఇప్పించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్యారెక్టర్ రెగ్యులర్ గా కాకుండా అన్షు మీద నెక్ట్స్ లెవెల్ కామెడీని ప్లాన్ చేశాడట త్రినాథరావు.
రావు రమేష్- అన్షు మధ్య వచ్చే సీన్స్ బాగా పేలిపోతాయని యూనిట్ సభ్యులంటున్నారు. లేట్ ఏజ్ లవ్ ట్రాక్స్ ను ఎంతో జాగ్రత్తగా డీల్ చేయాలి లేదంటే తేడా వచ్చేస్తుంది. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ స్పెషల్ గా ఈ ట్రాక్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మజాకా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇదే కథను చిరంజీవికి చెప్పగా, ఆయన వద్దనుకోవడంతో కథలో కొన్ని మార్పులు చేసి రావు రమేష్, సందీప్ కిషన్లకు తగ్గట్టు తెరకెక్కిస్తున్నాడు త్రినాథరావు.













