Anshu: మొత్తానికి అన్షు పేరు మార్మోగుతోందిగా!
ముంబై భామ అన్షు(Anshu) తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దానికి కారణం తను చేసిన మన్మథుడు(Manmadhudu) సినిమా ఆడియన్స్ లో మంచి ముద్ర వేయడమే. ఆ సినిమాలో తనది ఫుల్ లెంగ్త్ రోల్ కాకపోయినా తన యాక్టింగ్ తో అందరినీ కట్టి పడేసింది. రెండో సినిమాగా రాఘవేంద్ర(Raghavendra) చేసింది కానీ అది డిజాస్టర్.
దీంతో టాలీవుడ్ లో అన్షు కనుమరుగైపోయింది. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమా చేసింది అది కూడా సరిగా ఆడలేదు. దీంతో అన్షు ఇండస్ట్రీకి దూరమైంది. 20 ఏళ్ల తర్వాత అన్షు మన్మథుడు రీరిలీజ్ సందర్భంగా ఆన్లైన్ లో కనిపించి బాగా సన్నగా అయిపోయి అందరినీ ఆశ్చర్యపరించింది. ఇప్పుడు సడెన్ గా త్రినాథరావు నక్కిన(Trinadha Rao Nakkina) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మజాకా(Mazaaka) సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది.
హీరో తండ్రిగా చేస్తున్న రావు రమేష్(Rao Ramesh) కు జోడీగా అన్షు నటిస్తుంది. రావు రమేష్ కు జోడీగా అంటే తల్లి పాత్రలకు మారిపోయిందనుకుంటాం కానీ అన్షుది అలాంటి పాత్ర కాదని మజాకా టీజర్ చూస్తే అర్థమవుతుంది. మజాకా టీజర్ ఎంటర్టైనింగ్ గా ఉండటంతో పాటూ టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ అన్షుపై చేసిన కాంట్రవర్సీ కామెంట్ల వల్ల అన్షు పేరు నెట్టింట మార్మోగిపోతుంది. ఈ సినిమాలో తన పాత్ర క్లిక్ అయితే అమ్మడికి అవకాశాలు క్యూ కట్టడం ఖాయం.













