గీతా ఆర్ట్స్2 నుంచి మరో చిన్న సినిమా
కరోనా కాలంలో ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి నేరుగా వచ్చిన కొన్ని సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో ఒకటి మా ఊరి పొలిమేర. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే సత్యం రాజేష్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించగా, గెటప్ శ్రీను, బాలాదాత్య కీ రోల్స్ లో కనిపించారు. చేతబడుల చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ మూవీలో కొన్ని ట్విస్ట్ లు అదిరిపోతాయి.
హాట్ స్టార్ లో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఆ సినిమాలోనే హింట్ ఇచ్చాడు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్. చెప్పినట్లే పొలిమేర్2ను రెడీ చేశారు. మొదటి పార్ట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సారి కొంచెం బడ్జెట్ పెంచి గ్రాండ్ గా సినిమాను తెరకెక్కించారు. సినిమాకు మంచి బజ్ కూడా ఉండటంతో ఈసారి ఓటీటీలో కాకుండా థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను బన్నీ వాసు తన ఫ్రెండ్‌తో కలిసి ఓ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ కొనిందంటే ఊరికే కొనేయరు. వాళ్ల లెక్కలు వారికుంటాయి. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను కొనడంతో రిలీజ్ కు ముందే ఈ సినిమాను హిట్ గా పరిగణిస్తున్నారు ట్రేడ్ పండితులు.













