థియేటర్స్ యాజమాన్యాలు నిర్ణయంతో వకీల్ సాబ్‌కి మరో షాక్!
పవర్ ప్యాక్డ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘వకీల్ సాబ్’ కి యాజమాన్యాలు నిర్ణయంతో మరో షాక్! మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపై రీ-ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ కి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ బజ్ నెలకొన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి జనాల్లో చర్చనీయాంశంగా మారింది. కరోనా కారణంగా చిత్ర బెన్ఫిట్ షోస్ రద్దు చేయడం, టికెట్స్ రేట్స్‌పై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ‘వకీల్ సాబ్’ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ విషయంలో కొన్ని థియేటర్ల యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్ రేట్స్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏకంగా సినిమా ప్రదర్శననే నిలిపివేశారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏరియాను బట్టి టికెట్ రేట్స్ నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం పెద్ద పెద్ద పట్టణాలు మినహా మిగిలిన చోట్ల టికెట్ ధరలు చాలా తక్కువగా అంటే 20,15,10 మాత్రమే ఉన్నాయి. దీంతో నాలుగు ఆటలు హౌస్ ఫుల్ అయినా కూడా రోజు మొత్తం కలిపి లక్ష రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదట. దీంతో ఇక లాభంలేదని తాజాగా కొన్ని థియేటర్ల యాజమాన్యాలు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలనే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గజపతినగరంలో ఉన్న రెండు థియేటర్స్ ఇప్పటికే మూసివేయడం జరిగిందని తెలుస్తోంది. ఇదేబాటలో ఇంకొన్ని ఏరియాల్లోని థియేటర్స్ యాజమాన్యాలు వెళ్ళబోతున్నట్లు టాక్. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలే హాట్ హాట్ చర్చల్లో నిలుస్తుంటే తాజాగా థియేటర్స్ క్లోజ్ అంటూ వస్తున్న ఈ వార్తలు మరిన్ని చర్చలకు తెర లేపుతున్నాయి. ఏదేమైనా వకీల్ సాబ్ విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ మూవీ అనే టాక్ వచ్చింది. చిత్రంలో నటించిన నివేదా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి కాకపోతే వకీల్ సాబ్‌ని కష్టాలు మాత్రం వీడటం లేదు. ఇక మరో విషయం ఏమిటంటే కారంటైన్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ లేకుండానే ఈ రోజు మహిళా ఇది నీ విజయం అనే కార్యక్రమం జరుగనుంది ఈ సమావేశం లో థియేటర్ల విషయం ప్రస్తావనకు రావచ్చు.













