మరో ప్లాన్ లో సైంధవ్ మేకర్స్
సలార్ రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ అవలేదు కానీ డిసెంబర్ లో రిలీజ్ అని దాదాపు ఫిక్స్ అంటున్నారు. ఒకవేళ సలార్ డిసెంబర్ రిలీజ్ పక్కా అయితే ఏం చేయాలా అని ఇప్పటికే క్రిస్మస్ రిలీజ్ ఫిక్స్ చేసుకున్న నిర్మాతలు ప్లాన్ లు వేసుకుంటున్నారు. క్రిస్మస్ సినిమాల్లో వెంకటేష్ సైంధవ్ సినిమా డిసెంబర్ 22న టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
అదే రోజున షారుఖ్ డుంకీ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ ముందు వెనుక నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ట్రా సినిమాలున్నా వెనక్కు వెళ్లకూడదని డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పుడు సలార్ డిసెంబర్ 22న అంటుండటంతో సైంధవ్ టీమ్ ప్లాన్ బి రెడీ చేసే పనిలో ఉన్నారట. ఇందులో భాగంగా సైంధవ్ను సంక్రాంతి రేసులో దింపాలని చూస్తున్నారట.
సంక్రాంతికి ప్రాజెక్ట్ కె ఎలాగూ రిలీజ్ కావడం లేదు కాబట్టి మిగిలిన ఎన్ని సినిమాలున్నా ఆ సీజన్ లాక్కుని రాగలదు కాబట్టి కంటెంట్ పై నమ్మకంతో సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఈగల్, గుంటూరు కారం, హనుమాన్, విజయ్ దేవరకొండ సినిమాలు ఇప్పటికైతే రేసులో ఉన్నాయి కానీ ఇందులో ఏ సినిమాలు పక్కాగా సంక్రాంతికి వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ వచ్చినా సినిమా బాగుంటే సైంధవ్ కు కలెక్షన్స్ రావడం పక్కా. సైంధవ్ ను సంక్రాంతికి జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట మేకర్స్.













