Sukumar: యూఎస్ లోని తెలుగు ఆడియన్స్ వల్లే మరో సినిమా వచ్చింది

సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేశారు. అందులో కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ ఉంటే మరికొన్ని కేవలం ఎక్స్‌పెరిమెంట్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి వాటిలో సుకుమార్ తో చేసిన 1 నేనొక్కడినే(1 Nenokkadine) కూడా ఒకటి. సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందు ఎన్నో అంచనాలున్నాయి. కానీ రిలీజ్ తర్వాత ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది.
1 నేనొక్కడినే ఇండియాలో ఆడకపోయినా యూఎస్ లో మాత్రం బాగా ఆడింది. యూఎస్ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఆదరించారు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ సుకుమార్(Sukumar) తాజాగా తానా మహాసభల్లో ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను తీసిన 1 నేనొక్కడినే సినిమాను యూఎస్ లోని తెలుగు ఆడియన్స్ ఆదరించడం వల్లే తనకు వేరే సినిమా అవకాశమొచ్చిందని అన్నారు.
దాంతో పాటూ నవీన్(Mythri Naveen) లాంటి వ్యక్తిని టాలీవుడ్ కు అందించి, ఎన్నో మంచి సినిమాలు తీసేలా చేసినందుకు కూడా ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని, అమెరికా నుంచి వచ్చి తెలుగులో ఎన్నో హిట్ సినిమాలను తీయడమే కాకుండా ఎంతో మంది ఉపాధి కల్పించారని సుకుమార్ అన్నారు. తానా సభలకు వచ్చిన అల్లు అర్జున్(allu arjun) కు, దిల్ రాజు(dil raju) కు కూడా సుకుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు.