షాకింగ్ సర్ ప్రైజ్: వకీల్ సాబ్ లో మరో మెగా హీరో..!
పింక్ రీమేక్ వకీల్ సాబ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పింక్ రీమేక్ ను కొందరు తప్పుబడుతుంటే, మరి కొందరు లేడీ ఓరియెంటెడ్ సినిమాను పవన్ లాంటి స్టార్ హీరో చేయడం తప్పని అంటున్నారు.
పింక్ కు చాలా మార్పులే చేసి వకీల్ సాబ్ గా మార్చినట్లున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఆ విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సినిమాలోని సోల్ ను మిస్ చేయకుండా, పవన్ గ్రాఫ్ ఎక్కడా పడిపోకుండా ఈ సినిమాను శ్రీరామ్ వేణు తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. మెయిన్ గా సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుందంటున్నారు. అంతే కాదు ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరో సర్ ప్రైజ్ కూడా ఉంటుందని రీసెంట్ గా థమన్ బయట పెట్టాడు.
పవన్ కు జోడీగా నటించిన శృతి హాసన్ కూడా ఫ్లాష్ బ్యాక్ లోనే కనిపించనుందనే విషయాన్ని ఇప్పటికే రివీల్ చేశారు. మరి థమన్ చెప్పిన ఇంకో సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో.. వకీల్ సాబ్ లో మరో మెగా హీరో కనిపించనున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రచారం జరుగుతుంది. కొన్ని నిమిషాల పాటూ ఆ హీరో కనిపించడమే థమన్ చెప్పిన మరో సర్ ప్రైజ్ అంటున్నారు. సినిమాలో పవన్ ని, మరో మెగా హీరోను స్క్రీన్ పై చూశాక ఫ్యాన్స్, ఆడియన్స్ ఖచ్చితంగా సర్ ప్రైజ్ అవుతారట. మరి ఇంతకీ పవర్ స్టార్ తో కనిపించనున్న మరో మెగా హీరో ఎవరనేది ఏప్రిల్ 9 న చూడాల్సిందే.













