ఐరన్ లేడీ ఫస్ట్ లుక్ విడుదల
తమిళనాడు మాజీ సీఎం బయలలిత బయోపిక్‌లు తమిళనాట ఇప్పటికే మూడు నాలుగు తెరకెక్కుతున్నాయి. సినిమాలుగానే కాకుండా వెబ్ సిరిస్గానూ ఆమ్మ బయోపిక్‌ను తీసేందుకు సినీ వర్గాలు ఆస్తికి చూపిస్తున్నాయి. ఇప్పటికే అమ్మ బయోపిక్ ఒకటి ది ఐరన్ లేడీ టైటిల్‌తో స్క్రీన్కు ఎక్కుతోంది. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ సైతం విడుదలైంది. అయితే ఎన్ని బయోపిక్‌లు తీస్తున్నా ప్రముఖ దర్శకుడు విజయ్ తీయబోతున్న అమ్మ బయోపిక్‌పై అందరి దృష్టి ఉంది. ఆయన మాత్రమే అమ్మ సినిమాను సరిగ్గా తీయగలడంటూ తమిళ సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రేక్షకులు సైతం విజయ్ చూపించబోతున్న అమ్మ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ దర్శకత్వంలో రూపొందబోతున్న అమ్మ బయోపిక్ టైటిల్‌ను రిలీల్ చేశారు. బయలలిత జయంతి సందర్భంగా ఎలాంటి సృష్టత ఇవ్వని చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా టైటిల్ లోగో తలైవిని ఆవిష్కరించారు. తమిళంతోపాటు హిందీ మరియు తెలుగులోనూ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.













