Raj kumar rao: పేరెంట్స్ క్లబ్ లోకి మరో బాలీవుడ్ జంట
బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావ్ కు చాలా మంచి స్టార్డమ్, ఇమేజ్, క్రేజ్ ఉన్నాయి. నార్త్ లోని మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్లలో రాజ్ కుమార్ రావ్ కూడా ఒకరు. అయితే రాజ్ కుమార్ రావ్, పత్రలేఖ జంట ఇటీవలే తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఈ సెలబ్రిటీ జంటే సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించింది.
పత్రలేఖ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాజ్ కుమార్ రావ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా వెల్లడించారు. మా 4వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా దేవుడు మాకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఇది, మా గుండెలు ఆనందంతో నిండిపోయాయని చెప్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాజ్ కుమార్ రావ్ నెట్టింట ఓ పోస్ట్ చేశారు.
రాజ్ కుమార్ రావ్, పత్రలేఖ జంట తల్లిదండ్రులవడంతో పేరెంట్స్ క్లబ్ లోకి వెల్కమ్ అంటూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు వారికి విషెస్ చెప్తూ పోస్టులు, కామెంట్స్ పెడుతున్నారు. కాగా రాజ్ కుమార్, పత్రలేఖ కొన్ని రోజుల పాటూ ప్రేమించుకున్న తర్వాత 2021లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా మాలిక్, భూల్ చుక్ మాఫ్ సినిమాలతో రాజ్ కుమార్ రావ్ ఆడియన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే.






