సంగీత రీఎంట్రీ?
ఖడ్గం చిత్రంలో సినిమా హీరోయిన్ అవ్వాలనే అమాయకపు పల్లెటూరి అమ్మాయి పాత్ర చేసిన సంగీతను తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. తమిళ తెరపై ఎప్పుడో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె ఖడ్గం చిత్రానికి ముందు కొన్ని తెలుగు చిత్రాల్లో నటించినా ఆమెకు గుర్తింపు అంతగా రాలేదు. అయితే ఖడ్గం తర్వాత ఆమె వరుస అవకాశాలు అందుకుంది. ఎక్కువగా ఈమె చిన్న హీరోల సరసన చేశారు. విజయేంద్రవర్మ, సంక్రాంతి వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడ నటించారు. ఎక్కువగా తమిళ చిత్రాలు చేసిన సంగీత 2009లో క్రిష్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్న తర్వాత సినిమాలు తగ్గించారు. మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు. చిత్రంలో సంగీత ఓ కీలకపాత్రలో కన్పించనుందని సమచారం. ఓ పాత్రకు సంగీత అయితే సరిపోతుందని భావించిన దర్శకుడు ఆమెను ఆ పాత్రను చేయటడానికి ఒప్పించారని సమాచారం. రష్మిక మందన్నా మహేష్ సరసన నటిస్తోంది.













