నిశ్శబ్దంలో అంజలి లుక్ విడుదల
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న నిశ్శబ్దం చిత్రంలో ప్రముఖ నటి అంజలి కూడా నటిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న అంజలి లుక్ను చిత్ర యూనిట్ విడదల చేసింది. ఈ చిత్రంలో సాక్షి అనే వైవిధ్యమైన పాత్రలో అనుష్క నటిస్తోంది. ఇటీవలే ఆమె పాత్రకు సంబంధించి లుక్ను విడుదల చేశారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ పతాకంపై టీజీ. విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ, మలయాళ భాషల్లో నిశ్శబ్దం చిత్రాన్ని విడుదల చేస్తారు. అనుష్క, మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాజసన్, షాలిని పాండే, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులు. సంగీతం గోపీసుందర్, ఛాయాగ్రహణం షానియర్ డియో, సహ నిర్మాత వివేక్ కూచిభోట్ల.













