ఇప్పట్లో ఆ ఆలోచన లేదు….
తెలుగు హీరోయిన్ అంజలి టాలీవుడ్లో గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ సినిమాల్లో నటించినా ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. తెలుగు కంటే తమిళంలో ఎక్కువ గుర్తింపు సాధించింది. తాజాగా అంజలిపై కోలీవుడ్ మీడియాలో పెళ్లి వార్తలు వస్తున్నాయి. మీడియాలో ఆమె పెళ్లి వార్తలు రావడం కొత్తేమీ కాదు. కొంత కాలం క్రితం తమిళ హీరో జైతో లవ్ ఎఫైర్.. ఇద్దరూ చెట్టాపట్టాలేకుసుకొని ఇక నెక్ట్స్ పెళ్లి అనుకునే సమయంలో బ్రేకప్ కావడం అందరికి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం వరుడు ఎవరో తెలియదు కానీ అంజలి పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెబుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తీవ్రంగా స్పందించింది ఈ భామ. నేను సినిమాలకు గుడ్‌బై చెబుతున్నానని ఎవరు చెప్పారు? అంటూ ప్రశ్నించింది అంజలి. ఇవన్నీ రూమర్స్. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సినిమాలకు ఎందుకు దూరమవుతాను. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అని పేర్కొంది అంజలి.













