ఇకపై అలాంటి పాత్రలు చేయనంటున్న అంజలి
తెలుగమ్మాయి అంజలి మొదటి సినిమా తర్వాత టాలీవుడ్ లో ఛాన్సులు రావడం లేదని కోలీవుడ్ కు వెళ్లి అక్కడ సినిమాలు చేసింది. మళ్లీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టింది. అప్పటినుంచి అంజలికి ఛాన్సులైతే వస్తున్నాయి కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను తెచ్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అయింది. ఎప్పటికప్పుడు అంజలి పనైపోయిందనుకున్న ప్రతిసారీ అంజలి మళ్లీ కొత్త ఉత్సాహంతో సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్ గా కోన వెంకట్ తో కలిసి గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మరోసారి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయడానికి రెడీ అయింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో తన కెరీర్ పై తనకు వచ్చే పాత్రల మీద ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది అంజలి. తను చేసిన పాత్రల వల్ల తనకు ఇప్పటివరకు ఒకే తరహా పాత్రలు వచ్చాయని, అందుకే ఇకపై అలాంటి పాత్రలుకు నో అనేస్తున్నా అని చెప్పింది. అంతేకాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో తన రోల్ స్పెషల్ గా ఉంటుందని చెప్పింది. ఇకపై అంజలి డిఫరెంట్ రోల్స్ చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.













