చిన్న సినిమాకు అనిరుధ్ స్పీడ్
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన క్రేజ్, డిమాండ్ ఏ రేంజ్ లో ఉందంటే ఎంతటి డైరెక్టర్ అయినా సరే చెన్నైకు వెళ్లి తనతో పని చేయించుకోవాల్సిందే. లక్ బాగుండో లేదంటే హీరో రిక్వెస్ట్ చేస్తేనో తప్ప అస్తమానం అనిరుధ్ హైదరాబాద్కు వచ్చే పరిస్థితి లేదు.
డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టే అనిరుధ్ అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు రెడీ అవుతున్నారు. కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే ఉంటే సరిపోదు, సినిమాలో కథ, క్యాస్టింగ్ అన్నీ నచ్చితేనే అనిరుధ్ సినిమాను ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం అనిరుధ్ సంగీతంలో వస్తున్న దేవర మీద అందరికీ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఇలాంటి అనిరుధ్ ఓ చిన్న సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి- విజయ్ దేవరకొండ బ్యానర్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్ వల్ల ఆలస్యమవుతుండటం వల్ల ఈ గ్యాప్ లో గౌతమ్ ఓ చిన్న సినిమాను తీసేశాడు. ఆ సినిమాకు మ్యూజిక్ అనిరుధ్ అందిస్తుండటం విశేషం. ఇప్పటికే సాంగ్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయట.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కుదిరినంత త్వరగా ఇవ్వడానికి చూస్తున్నాడట అనిరుధ్. జెర్సీ టైమ్ నుంచి అనిరుధ్- గౌతమ్ మధ్య ఉన్న బాండింగే అనిరుధ్తో ఈ సినిమాను చేయిస్తుంది. మామూలుగా అయితే తనకున్న బిజీ షెడ్యూల్ లో అనిరుధ్ ఇలాంటి చిన్న సినిమాలను ఒప్పుకోడు. కానీ ఇప్పుడు అనిరుధ్ సినిమాను ఒప్పుకోవడమే కాకుండా మ్యూజిక్ అనుకున్న టైమ్ కంటే ముందే రెడీ చేయడం చూస్తుంటే వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అర్థం చేసుకోవచ్చు.













