దేవీ ప్లేసులోకి అనిరుధ్
సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) తన మ్యూజిక్ తో మామూలు సినిమాను సైతం నిలబెడుతుండటం చూసి చాలా మంది దర్శకనిర్మాతలు అతన్నే ఫస్ట ఆప్షన్ గా అనుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చన సినిమాలతో అనిరుధ్ తన మ్యూజిక్ తో విపరీతమైన ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్నాడు.
దేవర(Devara) సినిమా తర్వాత అనిరుధ్ కు టాలీవుడ్ లో కూడా మరింత డిమాండ్ ఏర్పడింది. తాజాగా నాని(Nani) సినిమాకు సంబంధించిన ఆఫర్ ను అనిరుధ్ అందుకున్నాడని టాక్. నాని హీరోగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో రానున్న భారీ మల్టీస్టారర్ సినిమాకు అనిరుధ్ కు సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకుంటున్నారట.
మొదట ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తాడన్నారు కానీ ఇప్పుడు అనిరుధ్ పేరు తెరపైకి వచ్చింది. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న దేవీ శ్రీ కూడా అనిరుధ్ స్పీడు ముందు నిలబడలేకపోతున్నాడనిపిస్తుంది. ప్రస్తుతం దేవీ శ్రీ పుష్ప2(Pushpa2) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే నాని- అనిరుధ్ కాంబోలో వచ్చిన గ్యాంగ్ లీడర్(Gang Leader), జెర్సీ(Jersey) సినిమాల్లోని సాంగ్స్ ఎంత సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు శ్రీకాంత్ సినిమాతో మరోసారి అనిరుధ్ తన బెస్ట్ ఇస్తాడని అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. దసరా తర్వాత నాని- శ్రీకాంత్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దానికి తోడు అనిరుధ్ కూడా ఈ ప్రాజెక్టుకు తోడైతే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.













