Toxic: టాక్సిక్ కోసం వర్క్ చేయనున్న అనిరుధ్

కెజిఎఫ్(KGF) ఫ్రాంచైజ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్(Yash). కెజిఎఫ్ సినిమాలతో వచ్చిన క్రేజ్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలని యష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే యష్ చాలా గ్యాప్ తీసుకుని తన తర్వాతి సినిమాను గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) దర్శకత్వంలో టాక్సిక్(Toxic) అనే సినిమాను అనౌన్స్ చేశాడు.
అయితే ఇప్పుడు ఈ టాక్సిక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) వర్క్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే టాక్సిక్ కోసం అనిరుధ్ వర్క్ చేస్తుంది సాంగ్స్ కోసం కాదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసమని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగానే అనిరుధ్ టాక్సిక్ కోసం వర్క్ చేస్తే ఇది మరో సెన్సేషన్ అవడం ఖాయం.
భారీ బడ్జెట్ తో హాలీవుడ్ లెవెల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా, నయనతార(Nayanthara) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. టాక్సిక్ తో పాటూ యష్ బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రామాయణ (Ramayana)లో రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించడంతో పాటూ ఆ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు యష్.