Anirudh: వెంకట్ ప్రభు సినిమాకు అనిరుధ్

అమరన్(Amaran) సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న శివ కార్తికేయన్(Siva Karthikeyan) ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను చేస్తున్నారు. అమరన్ తర్వాత తన 25వ సినిమాగా సుధా కొంగర(Sudha Kongara) దర్శకత్వంలో పరాశక్తి(Parasakthi) మూవీని చేస్తున్న శివ కార్తికేయన్ ఆ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దాంతో పాటూ మరో రెండు ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన శివ కార్తికేయన్ కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో ఓ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే.
వెంకట్ ప్రభు సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య ఆయన అనుకున్నంత ఫామ్ లో లేరు. వెంకట్ ప్రభు ఫామ్ లో లేకపోయినా శివ కార్తికేయన్ మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఈ మూవీ వర్కవుట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి కలయికలో రానున్న సినిమా గురించి ఇప్పుడో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
వెంకట్ ప్రభు, శివ కార్తికేయన్ కలిసి సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నారని, ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అనిరుధ్, శివ కార్తికేయన్ కలిసి పలు సినిమాలు చేసినప్పటికీ వెంకట్ ప్రభు సినిమాకు అనిరుధ్ సంగీతం అందించడం ఇదే మొదటిసారి. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవనుండగా, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుంది.