చైతూ-చందూ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్?
థాంక్యూ, కస్టడీ సినిమాలతో ఫెయిల్యూర్లు అందుకున్న అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య తన తర్వాతి సినిమాను చందూ మొండేటి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో రానున్న సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. చందూ గత సినిమా కార్తికేయ2 వంద కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకురావడంతో ఆ పాజిటివ్ బజ్ చైతూ సినిమాపై బాగా పడనుంది.
కార్తికేయ2తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న చందూకి బయట ఇండస్ట్రీల నుంచి కూడా ఆఫర్లు బాగానే వచ్చాయి కానీ చందూ మాత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను మొదలు పెట్టాడు. చైతూ తో కూడా చందూ మొండేటి కార్తికేయ2 లాంటి విభిన్నమైన కాన్సెప్ట్ నే రెడీ చేసినట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమా గురించి ఇప్పుడొక వార్త వినిపిస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించనున్నారనేదే ఆ వార్త. చందూ, చైతూ కాంబో కు ఉన్న క్రేజ్ కారణంగానే అనిరుధ్ ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరంలో సినిమాను స్టార్ట్ చేసి వచ్చే యేడాది మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.













