నాని సినిమాకు ఆ మ్యూజిక్ డైరెక్టరా?
సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) కు తనకంటూ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎక్కువగా తమిళ సినిమాలకు సంగీతం అందించిన అనిరుధ్ తెలుగులో మొదటిసారిగా అజ్ఞాతవాసి(Agnyathavasi) సినిమా కోసం పనిచేశాడు. ఆ సినిమాలో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ మూవీ కమర్షియల్ ఫ్లాప్ అయింది. తర్వాత నాని(nani) జెర్సీ(Jersey) సినిమాకు కూడా అనిరుధ్ సంగీతం అందించాడు.
ఆ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అవలేదు. అయితే జెర్సీకి అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఇప్పటికీ స్పెషల్ గానే ఉంటుంది. తర్వాత మళ్లీ నానితో గ్యాంగ్ లీడర్(Gang Leader) కు కూడా అనిరుధ్ కలిసి వర్క్ చేశాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత అనిరుధ్ తెలుగులో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు.
రీసెంట్ గా రిలీజైన దేవర(devara) సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. దేవరలో అనిరుధ్ పాటలకు, బీజీఎంకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కంటెంట్ వీక్ గా ఉన్న ప్రతీచోటా అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆ సన్నివేశాన్ని ఎలివేట్ చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు అనిరుధ్ మరోసారి నేచురల్ స్టార్ నానితో కలిసి వర్క్ చేయబోతున్నట్లు టాక్. దసరా తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల(srikanth Odela) దర్శకత్వంలో రానున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్‌ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ వార్త నిజమైతే మాత్రం నాని-శ్రీకాంత్ మూవీకి అనిరుధ్ సంగీతం మేజర్ హైలైట్ కావడం ఖాయం.













