Anirudh: టాలీవుడ్లో బిజీ అవుతున్న అనిరుధ్
సౌత్ సెన్సేషన్ అనిరుధ్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అనిరుధ్(Anirudh) ఓ సినిమాకు వర్క్ చేస్తున్నాడంటే చాలు ఆ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోతాయి. పలు భాషల్లో సినిమాలకు వర్క్ చేస్తున్న అనిరుధ్ ప్రెజెంట్ చాలా బిజీగా ఉన్నాడు. అనిరుధ్ క్రేజ్, తన వర్క్ చూశాక ప్రతి ఒక్కరూ అనిరుధ్‌తో పని చేయాలనుకుంటున్నారు.
కానీ అనిరుధ్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో మొన్నటివరకు వచ్చిన ప్రతీ ఛాన్స్ ను ఒప్పుకోలేకపోయాడు. ఇంత బిజీ షెడ్యూల్లో ఒకవేళ అనిరుధ్ దొరికి డేట్స్ ఇచ్చినా తనతో పని చేయించుకోవడం మాత్రం పెద్ద సవాల్ గా మారింది. అందరూ ఇలా అనుకుంటున్న టైమ్ లో అనిరుధ్ మెల్లిగా టాలీవుడ్ లో జెండా పాతాలని చూస్తున్నాడు.
కమిట్ అయిన సినిమాలకు సంబంధించిన మ్యూజిక్ ను అడిగిన టైమ్ లో ఇస్తూ దర్శకనిర్మాతలను ఎంగేజ్ చేస్తున్న అనిరుధ్, రీసెంట్ గా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కింగ్ డమ్(Kingdom) టీజర్ తో అందరినీ ఇంప్రెస్ చేశాడు. అనిరుధ్ అదే బ్యానర్ లో రూపొందుతున్న మ్యాజిక్(Magic) సినిమాకు కూడా వర్క్ చేశాడు. మొన్నా మధ్యే ఫస్ట సాంగ్ రిలీజైంది. త్వరలోనే మ్యాజిక్ ఫైనల్ వెర్షన్ రీరికార్డింగ్ ను పూర్తి చేయబోతున్నాడని టాక్.
ఇది కాకుండా మార్చి 3న రానున్న ది ప్యారడైజ్(The Paradise) టీజర్ కు కూడా అనిరుధ్ నెక్ట్స్ లెవెల్ బీజీఎం ఇచ్చాడంటున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో అనిరుధ్‌కి ఈ మూడు సినిమాలు చాలా కీలకం కాబోతున్నాయని అర్థమవుతుంది. ఇవి కాకుండా చిరూ(Chiru)- ఓదెల(Odela), బాలయ్య(Balayya)- గోపీచంద్(Gopichand) సినిమాలు కూడా అనిరుధ్ ఒప్పుకున్నాడని సమాచారం. కాకపోతే ఇంకా అగ్రిమెంట్స్ చేసుకోలేదని తెలుస్తోంది. ఏదేమైనా అనిరుధ్ స్పీడ్ చూస్తుంటే టాలీవుడ్ లో జెండా పాతడం ఖాయంలా అనిపిస్తుంది.













