Animal: రెండేళ్ల తర్వాత ఆ దేశంలో యానిమల్ రిలీజ్
ఇండియన్ సినిమాలో యానిమల్(Animal) మూవీ సృష్టించిన చరిత్ర అలాంటి ఇలాంటిది కాదు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీలో రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలోని కంటెంట్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతో దీనికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లే వచ్చాయి.
ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ మూవీకి అన్ని భాషల్లోని ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే యానిమల్ మూవీ ఇండియాలో రిలీజైన రెండేళ్లకు జపాన్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.
జపాన్ దేశంలో యానిమల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఆల్రెడీ ఇండియాలో ఎన్నో విధ్వంసాలు సృష్టించిన యానిమల్ వచ్చే ఏడాది మొదట్లో జపాన్ లోనూ విధ్వంసం సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి జపాన్ లో యానిమల్ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.






