Anil-Chiru: చిరూని ఎలా చూపిస్తాడో క్లారిటీ ఇచ్చిన అనిల్
టాలీవుడ్ లో ఫ్లాపే లేని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) పేరు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా పటాస్(pataas) నుంచి గతేడాది వచ్చిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) వరకు అన్నీ హిట్ల. ఈ పండక్కి సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న అనిల్ మరోసారి ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తానని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు.
దానికి తగ్గట్టే సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటలన్నీ చార్ట్బస్టర్లయ్యాయి. ఈ సినిమా తర్వాత అనిల్ సాహు గారపాటి(sahu garapati) నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో సినిమా చేయనున్న విషయం తెలసిందే. ఇప్పటికే స్టోరీ లైన్ కన్ఫర్మ్ అయింది. రీసెంట్ గా స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో భాగంగా చిరు ఇంట్లో డిస్కషన్స్ కూడా జరిగాయి.
అయితే తన సినిమాలో చిరూని ఎలా చూపిస్తాడనే దానిపై అనిల్ కు ప్రశ్న ఎదురవగా దానికి అనిల్ క్లారిటీ ఇచ్చాడు. చిరంజీవిని తాను ఎలా చూడాలని కోరకుంటున్నానో అలానే స్క్రీన్ పై ప్రెజెంట్ చేస్తానని, ఫైనల్ గా ఆడియన్స్ ను మెప్పించడమే టార్గెట్ గా పెట్టుకుని కథలు రాసుకుంటానని అనిల్ తెలిపాడు. మిగలిన విషయాలన్నీ ఫైనల్ స్క్రిప్ట్ లాకయ్యాకే చెప్తానంటున్నాడు అనిల్.













