Raghavendra Rao: చిరూ సినిమా కోసం దర్శకేంద్రుడి టైటిల్ సలహా
వెంకటేష్(Venkatesh) హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఎస్వీసీ(SVC) బ్యానర్ లో దిల్ రాజు(Dil Raju) సమర్పణలో శిరీష్(Sirish) నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విక్టరీ వేడుకను నిర్వహించగా, దానికి చీఫ్ గెస్టుగా రాఘవేంద్ర రావు(Raghavendra Rao) హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ల నటన అద్భుతంగా ఉందని, వెంకటేష్ బయట సైలెంట్ గా కనిపించినా తెరపై ఇద్దరు హీరోయిన్లతో బాగా సందడి చేస్తాడన్నాడు. డైరెక్టర్ అనిల్ గురించి మాట్లాడుతూ, నువ్వు సంక్రాంతి సీజన్ ను వదిలిపెట్టొద్దని ఆయన అనిల్ కు సూచించారు.
ఇదిలా ఉంటే అనిల్ తన తర్వాతి సినిమాను చిరంజీవి(Chiranjeevi)తో చేయనున్న విషయం తెలిసిందే. స్వయంగా మెగాస్టార్ చిరంజీవే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. దీంతో మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చే సినిమాకు టైటిల్ ను సూచించారు రాఘవేంద్ర రావు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టావు. నెక్ట్స్ చిరంజీవి తో సంక్రాంతి అల్లుడు(Sankranthi Alludu) అనే సినిమా తీసి మరో హిట్ అందుకోమని ఆయన అనిల్ కు చెప్పాడు. రాఘవేంద్ర రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.













