Dhandoraa: ‘దండోరా’ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను – అనిల్ రావిపూడి
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో..
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘దండోరా’ నిర్మాత బెన్నీ గారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు సినిమా మీద ఉండే అభిరుచి నాకు చాలా ఇష్టం. ఆయనెప్పుడూ టేస్ట్ ఉన్న చిత్రాల్నే నిర్మిస్తుంటారు. మళ్లీ డిసెంబర్ 25న ఈ ‘దండోరా’తో ఆయనకు విజయం దక్కాలి. ‘దండోరా’ టైటిల్ నాకు చాలా నచ్చింది. ఈ పాటను రాసిన కాసర్ల శ్యాంకి నేషనల్ అవార్డు దక్కాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో అద్భుతమైన ఆర్టిస్టులు నటించారు. ‘దండోరా’ టీంకు నేను ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నాను. టీజర్, ట్రైలర్ చూస్తుంటే నాకు ‘దండోరా’ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా మారుతుందని అనిపించింది. సమాజంలోని బలహీనతను దమ్ముతో దండోరా వేయించి చెప్పేందుకు చాలా గట్స్ ఉండాలి. డైరెక్టర్ మురళీకాంత్ గారికి చాలా దమ్ము, ధైర్యం ఉంది. బిందు మాధవి చాలా సెలెక్టివ్‌గా పాత్రల్ని ఎంచుకుంటోంది. ‘గౌతమ్ ఎస్ఎస్సి’ చిత్రానికి అప్రెంటిస్‌గా పని చేశాను. నవదీప్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, నటుడిగా ఎంతో సక్సెస్ అయ్యాడు. నవదీప్ మరిన్ని అద్భుతమైన పాత్రల్ని పోషించాలని కోరుకుంటున్నాను. నా సినిమాలు సక్సెస్ అయితే నా ఫ్యామిలీ మెంబర్లకంటే శివన్న ఎక్కువగా సంతోషిస్తుంటారు. తన కోసం, తనకంటూ కొత్త పాత్రల్ని రాయాలనే సవాల్‌ను రాబోయే దర్శకులకి శివాజీ గారు విసురుతున్నారు. డిసెంబర్ 25న రాబోతోన్న ‘దండోరా’ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రమోషన్ చేస్తే సినిమాపై అటెన్షన్ పెరుగుతుంది.. కంటెంట్ ఉంటేనే సినిమాను జనాలు ఆదరిస్తారు, చూస్తారు. గత కొన్ని నెలల నుంచి చిన్న చిత్రాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. డిసెంబర్ 25న కంటెంట్ ఉన్న చిత్రాలు వస్తున్నాయి. ‘దండోరా’కి అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్’ అని అన్నారు.
శివాజీ మాట్లాడుతూ.. ‘నా సోదరుడు అనిల్ రావడంతో మా సినిమా మరింత మందికి రీచ్ అవుతుంది. డప్పు సౌండ్ వింటే నాకు పూనకం వస్తుంది. నిర్మాత బెనర్జీ ఎంతో అభిరుచి ఉన్న వ్యక్తి. మంచి కథల్ని సెలెక్ట్ చేసుకోవడం అంత సులభమైన పని కాదు. బెనర్జీ గారికి కథల మీద మంచి పట్టు ఉంది. ‘దండోరా’ తరువాత ఆయన్ను చూసే తీరు మారుతుంది. మురళీకాంత్ అమెరికాను విడిచి పెట్టి సినిమా మీదున్న ప్యాషన్‌తో మంచి కథను రాసుకుని ఇక్కడకు వచ్చాడు. అతను స్క్రిప్ట్ అద్భుతంగా రాసుకున్నాడు. నా పాత్ర కూడా బాగానే ఉంటుంది. కానీ ఇందులోని ఓ పాత్రకి మాత్రం నేను చాలా కనెక్ట్ అయ్యాను. నా ఈ రీ ఎంట్రీలో మంచి కథ, మంచి చిత్రమైతేనే చేయాలని ఫిక్స్ అయ్యాను. లేదంటే సినిమాలే చేయొద్దని నిర్ణయించుకున్నాను. ‘కోర్ట్’ కంటే ముందే ఈ ‘దండోరా’ కథను ఒప్పుకున్నాను. నా సినిమా అయినా సరే బాగా లేకపోతే, నచ్చకపోతే నేనే విమర్శిస్తాను. ‘దండోరా’ సినిమాలోని కంటెంట్‌లో మాత్రం మేం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంచి చిత్రాల్ని మీడియా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ‘దండోరా’ అద్భుతంగా వచ్చింది. ఈ వారం రాబోతోన్న చిన్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి. కానీ డిసెంబర్ 25 సాయంత్రానికి ఇది పెద్ద సినిమా అవుతుంది. అందరికీ నచ్చే సినిమా.. పది మందికి చెప్పే సినిమా. ఈ చిత్రానికి పని చేసిన టెక్నికల్ టీంకు థాంక్స్. ఇందులో నాకు బిందు మాధవి గారి పాత్ర చాలా ఇష్టం. తెలుగులో గొప్ప ఆర్టిస్టులున్నారు. బోలెడంత టాలెంట్ ఇక్కడే ఉంది. ప్రతీ ఒక్కరూ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ప్రపంచమంతా మా ‘దండోరా’ సౌండ్ వినిపిస్తుంది’ అని అన్నారు.
నవదీప్ మాట్లాడుతూ.. ‘‘దండోరా’లో ఏదో ఒక కొత్త విషయం, మ్యాటర్ ఉందని మాత్రం జనాల వరకు రీచ్ అయింది. డిసెంబర్ 23 నుంచే మేం ప్రీమియర్లను వేస్తున్నాం. ఇప్పటి వరకు మేం చాలా మందికి సినిమాను చూపించాం. అందరూ మా మూవీని మెచ్చుకున్నారు. మా సినిమాకి నార్మల్ రేట్లకే టికెట్లు అందుబాటులో ఉంటాయి. ‘దండోరా’ టైటిల్ సాంగ్‌ను కాసర్ల శ్యాం గారు అద్భుతంగా రాశారు. సినిమా సారాంశాన్ని అందులోనే ఆయన రాశారు. కథను రివీల్ చేయకుండా టీజర్, ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. కథ తెలిసిన నేను వాటిని చూసి ఆశ్చర్యపోయాను. ఈ కథను మాత్రం ఎవ్వరూ గెస్ చేయలేరు’ అని అన్నారు.
నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని మాట్లాడుతూ.. ‘మురళీ నాకు మూడేళ్ల క్రితం స్టోరీ చెప్పాడు. అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ‘దండోరా’ లాంటి చిత్రాన్ని సపోర్ట్ చేయాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సపోర్ట్ ఎంతో అవసరం. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘దండోరా’ మూవీకి స్టోరీనే హీరో, కంటెంట్ హీరోయిన్. మిగతాది సక్సెస్ మీట్లో మాట్లాడతాను’ అని అన్నారు.
దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ.. ‘మంచి సినిమాల్ని తీస్తే థియేటర్లకు జనాలు వస్తారని నిరూపిస్తున్న అనిల్ రావిపూడి గారికి థాంక్స్. ఈ రోజు ఆయన మా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. నేను ఇక్కడకు సినిమా తీయాలని వచ్చాను. మూవీ తీశాను. నా దృష్టిలో నేను విజయం సాధించేశాను. బెన్నీ గారికి నేను చెప్పిన కథ నచ్చింది. నా ఐడియాలజీ నా నిర్మాతకు భారం కాకూడదని అనుకున్నాను. సగం కథ వినే శివాజీ గారు ఈ మూవీని ఒప్పుకున్నారు. ఆయన వచ్చాకే అన్నీ సక్రమంగా సమకూరుతూ వెళ్లాయి. ఈ చిత్రంలోకి చివరగా బిందు గారు వచ్చారు. నాకు సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన వెంకట్, సృజన, క్రాంతి, రేఖ, మార్క్, ఎడ్వర్డ్లకు థాంక్స్. ఇప్పటి వరకు మూవీని చూసిన వారంతా బాగుందని అన్నారు. డిసెంబర్ 25న మా మూవీని అందరూ చూడండి. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని అన్నారు.
బిందు మాధవి మాట్లాడుతూ.. ‘‘దండోరా’లో నటించిన మా అందరికీ ఈ చిత్రం ఎంతో స్పెషల్. ఇప్పటి వరకు మా సినిమాని చూసిన ప్రతీ ఒక్కరూ మెచ్చుకున్నారు. డిసెంబర్ 25న మా చిత్రాన్ని చూడండి. ఇందులోని కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. కంటెంట్‌తో పాటుగా కమర్షియల్‌గా మా ‘దండోరా’ ఉంటుంది’ అని అన్నారు.
మైత్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దండోరా’ని మాకు ఇచ్చిన బెన్నీ గారికి థాంక్స్. ఈ చిత్రంలోని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ తమ తమ పాత్రల్లో జీవించారు. నేను ఈ మూవీని చూశాను. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌ను ఇందులో చూపించబోతోన్నారు. అవార్డ్ మూవీలా కాకుండా అన్ని రకాల కమర్షియల్ అంశాల్ని కలగలపి తెరకెక్కించారు. ఆలోచన రేకెత్తించేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
నటుడు రవికృష్ణ మాట్లాడుతూ.. ‘‘దండోరా’ నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. ఇందులో నేను ఓ పాటలో డ్యాన్స్ చేశాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన మురళీ గారికి థాంక్స్. ఇలాంటి చిత్రాల్ని నిర్మించాలంటే నిర్మాతలకు చాలా గట్స్ ఉండాలి. బెన్నీ గారు ఇలాంటి చిత్రాలెన్నో నిర్మించాలని కోరుకుంటున్నాను. మార్క్ కె రాబిన్ సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది. ‘దండోరా’ టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. డిసెంబర్ 25న మా ‘దండోరా’ మూవీని చూడండి. సినిమా మిమ్మల్ని కచ్చితంగా నిరుత్సాహపర్చదు’ అని అన్నారు.
డీఓపీ వెంకట్ ఆర్. శాకమూరి మాట్లాడుతూ.. ‘‘దండోరా’ అద్భుతమైన కథతో రాబోతోంది. మురళీకాంత్ చాలా గొప్ప కథను రాసుకున్నారు. ఇలాంటి చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు బెన్నీ గారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చాలా తక్కువ టైం అంటే 40 రోజుల్లో ఈ మూవీని ఫినిష్ చేయడం అన్నది మా అందరికీ పెద్ద టాస్క్‌లా అనిపించింది. అందరి సహకారంతో షూటింగ్ చాలా సజావుగా సాగింది. డిసెంబర్ 25న మా ‘దండోరా’ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నటుడు ఎడ్వర్డ్ స్టీవెన్సన్ పెరెజ్ మాట్లాడుతూ.. ‘‘దండోరా’ చిత్రానికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడమే కాకుండా, ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించాను. మాకు ఇంతగా సహకరించిన టీంకు థాంక్స్. ‘దండోరా’ ఓ గొప్ప కథతో రాబోతోంది. డిసెంబర్ 25న మా చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ క్రాంతి ప్రియం మాట్లాడుతూ..‘‘దండోరా’ చిత్రానికి గానూ నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. బెన్నీ గారితో, డీఓపీ వెంకట్ గార్లతో ‘కలర్ ఫోటో’కి పని చేశాను. ఎడిటర్ సుజన గారితో ‘స్టూడెంట్’ మూవీకి పని చేశాను. ఇలా అందరితో కలిసి నేను పని చేశాను. మేమంతా కలిసి చేసిన ‘దండోరా’ పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.






