Anil Ravipudi: నా భార్యకు వీడియోలు మరీ పంపి అడుగుతున్నారు: అనిల్ రావిపూడి
కెరీర్లో అపజయమెరుగని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. గత నెలలో సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) తో మంచి హిట్ అందుకున్న అనిల్ తన నెక్ట్స్ మూవీని చిరంజీవి(Chiranjeevi)తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా అనిల్ ఓ ఇంటర్వ్యూలో తక కెరీర్, ఇంటర్నెట్ లో తనపై వస్తున్న వీడియోలపై మాట్లాడాడు.
పలు సినిమాలకు రచయితగా పని చేసిన అనిల్ రైటర్ గా మంచి గుర్తింపు వచ్చాకే డైరెక్టర్ గా మారాడు. అయితే అనుకున్న వెంటనే అనిల్ డైరెక్టర్ అయిపోలేదు. డైరెక్టర్ అవాలనుకున్న తర్వాత ముందు మూడేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డ అనిల్, తర్వాత కళ్యాణ్ రామ్(Kalyan Ram) అవకాశమివ్వడంతో పటాస్(Pataas) మూవీతో డైరెక్టర్ గా మారాడు.
ఈ సందర్భంగా అనిల్ తనపై సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలపై రియాక్ట్ అయ్యాడు. తన గురించి ఇష్టమొచ్చినట్టు కథలు రాసి, ఆ కథలకు మంచి వాయిస్ ఓవర్ తో వీడియోలు క్రియేట్ చేస్తున్నారని, అవి చూసి కుటుంబ సభ్యులు, చుట్టాలు తన భార్యకు పంపి అనిల్ గురించి ఇలా అంటున్నరేంటి అని అడుగుతున్నారని, ఇప్పటికే ఈ విషయంలో తాను సైబర్ పోలీసులకు కంప్లైట్ ఇచ్చానని, ఇప్పటికైనా అలాంటివి చేయడం మానేస్తే బావుంటుందని అనిల్ హెచ్చరించాడు.













