ఆ ధైర్యం చేయలేనంటున్న అనిల్ రావిపూడి
ఇప్పుడెక్కడ చూసినా, ఏ సినిమా అయినా సరే సీక్వెల్స్ కు సై అంటోంది. సీక్వెల్స్ ట్రెండ్ సినీ ఇండస్ట్రీలో బాగా ఎక్కువైంది. హిట్ అయిన ప్రతి సినిమాకూ సీక్వెల్ లేదా ఫ్రాంచైజ్ లా సినిమాకు పార్టులు అనౌన్స్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే క్లైమాక్స్ లో సీక్వెల్ కు సంబంధించిన హింట్స్ కూడా ఇస్తున్నారు.
సినిమా హిట్ అయితే సీక్వెల్ గురించి ఆలోచిస్తున్నారు. ఫ్లాప్ అయితే ఆడియన్స్ తో పాటూ మేకర్స్ కూడా ఆ సీక్వెల్ గురించి మర్చిపోతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో తాజాగా హిట్ సినిమాగా నిలిచిన భగవంత్ కేసరి కు సీక్వెల్ ఉంటుందా అని డిస్కషన్స్ జరుగుతుండగా, చిత్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి అది దాదాపు అసాధ్యమే అన్నట్లు చెప్పాడు.
భగవంత్ కేసరి సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అనిల్ కు భగవంత్ కేసరి సీక్వెల్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి అనిల్ సమాధానమిస్తూ, ఈ సినిమాకు సీక్వెల్ చేసే ధైర్యం నాకు లేదు. ఇప్పటికే నేను చాలా ఎక్కువ భారాన్ని మోసి అలసిపోయాను. సీక్వెల్ చేయడానికి సరిపోయే ధైర్యం, దమ్ము బాలకృష్ణ తనకు ఇస్తే, అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు అనిల్. కాగా భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ దిశగా అడుగులేస్తుంది.













