Mega157: చిరూ పాత్రపై అనిల్ క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ పై మొదటి నుంచి మంచి అంచనాలుండగా అనిల్ కూడా ఈ మూవీని అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీ చిరూ కెరీర్ లో 157వ సినిమాగా తెరకెక్కుతుంది.
అందులో భాగంగానే ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు షెడ్యూళ్లను పూర్తి చేశాడు అనిల్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ పేరును రీసెంట్ గా ఓ ప్రోగ్రామ్ లో భాగంగా అనిల్ రివీల్ చేశాడు. మెగా157(Mega157)లో చిరూ పేరు శివ శంకర వర ప్రసాద్(siva shankara vara prasad) అని అనిల్ స్వయంగా వెల్లడించడంతో ఇన్నాళ్లుగా ఈ పేరు విషయంలో వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది.
చిరంజీవి సినిమాల్లోకి రాకముందు తన అసలు పేరు కూడా ఇదే అవడం, ఇప్పుడు సినిమాలో చిరూ(Chiru) పాత్రకు అనిల్ అదే పేరు పెట్టడంతో ఈ విషయం ప్రత్యేకంగా మారింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ సినిమా విజయంపై దర్శకనిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆగస్ట్ 22న ఈ సినిమా నుంచి మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా టైటిల్ ను రివీల్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.