MSG: అనిల్ అప్పుడే పూర్తి చేస్తున్నాడా?

టాలీవుడ్ లో ఫ్లాప్ లేని డైరెక్టర్ గా అనిల్(anil) కు పేరుంది. అందుకే ఆయన్ని అందరూ టాలీవుడ్ హిట్ మిషన్ అంటుంటారు. అనిల్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతీ సినిమా హిట్ గా నిలవగా, ఆఖరిగా సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) మూవీతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. తన సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే అనిల్ సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తాడు.
ప్రీ ప్రొడక్షన్ లోనే అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం వల్ల షూటింగ్ కు వెళ్లాక ఎక్కువ టైమ్ తీసుకోకుండా అనుకున్న దానికంటే చాలా ముందుగానే సినిమాను పూర్తి చేస్తాడు అనిల్. ఇక అసలు విషయానికొస్తే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో మన శంకరవరప్రసాద్ గారు(mana shankaravaraprasad garu) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఇవాళ నుంచి మొదలైందని తెలుస్తోంది. సినిమాలోని అన్ని షెడ్యూల్స్ లో ఇదే లాంగ్ షెడ్యూల్ అని, ఈ షెడ్యూల్ లోనే చిరూ(chiru), వెంకీ(venky) పై సీన్స్ ను కూడా తెరకెక్కించనున్నారని సమాచారం. అక్టోబర్ 20 నుంచి మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ లో వెంకీ(venky) కూడా జాయిన్ అవనున్నారని, ఈ షెడ్యూల్ తో చిత్ర షూటింగ్ దాదాపు పూర్తవుతుందని తెలుస్తోంది. 2026 సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.