Anil Ravipudi: ప్రభాస్ సినిమాలో నటిస్తానంటున్న అనీల్
ప్రస్తుతం రాజా సాబ్(Raja Saab), ఫౌజీ(Fouji) సినిమాలతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), ఆ తర్వాతి సినిమా స్పిరిట్(Spirit) ను సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న స్పిరిట్ కోసం సందీప్ నటీనటులను ఎంపిక చేసే పనిలో ఇప్పుడు బిజీగా ఉన్నాడు. అయితే ఆ సినిమాలో తనకు ఛాన్స్ ఇవ్వమని డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) సందీప్ రెడ్డి వంగాని అడిగినట్టు తెలుస్తోంది.
ఈ విషయాన్ని స్వయంగా అనీల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తనకు పూర్తి స్థాయిలో నటుడిగా మారే ఆలోచన లేకపోయినా ఛాన్స్ వస్తే ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరికైతే ఉందట. ఈ నేపథ్యంలోనే సందీప్ ను కలిసి స్పిరిట్ లో ఛాన్స్ అడిగినట్టు వెల్లడించాడు. అయితే అనిల్ పెద్ద ప్రాధాన్యత ఉన్న పాత్ర అడగలేదు కాబట్టి సందీప్ ఓకే చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే సందీప్ చేసే సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, అతడిలా సినిమాలు చేయలేను కానీ అలాంటి సినిమాలంటే చాలా ఇష్టమని అనిల్ గతంలోనే చెప్పాడు. సందీప్ లా ఉండాలని, అతన్ని అనుకరించాలని ఉన్నట్టు చెప్పిన అనిల్, ఇండస్ట్రీలో ఎవరి స్టైల్ వారికుంటుందని తెలిపాడు. ప్రభాస్ కు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టమైన నేపథ్యంలో అనిల్ మంచి స్క్రిప్ట్ తో వెళ్తే ప్రభాస్ నో చెప్పే ఛాన్సే లేదు.













