శ్రీలీల క్యారెక్టర్ గురించి అనిల్ క్లారిటీ
ఈ వారం రిలీజైన భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా భగవంత్ కేసరి చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా శ్రీలీల క్యారెక్టర్ కు గ్లామర్ టచ్, డ్యాన్సులు లేదని కొందరు కామెంట్ చేస్తున్నారని వివరించాడు అనిల్.
ఒక ఫోబియాతో ఇబ్బంది పడుతున్న అమ్మాయిని ఆర్మీలో జాయిన్ చేయడానికి తండ్రి లాంటి వ్యక్తి కష్టపడుతుంటే ఆ సీన్స్‌లో పాటలు, డ్యాన్సులు కావాలని కోరుకునే వాళ్లు అసలు ఎలాంటి మైండ్ సెట్లో ఉంటారో వాళ్లకే తెలియాలని, పేరు ప్రస్తావించకుండానే కౌంటర్ వేశాడు అనిల్. అంతేకాదు కొన్ని ఇబ్బందులు, సమస్యలు అమ్మాయిలు, తండ్రికి సైతం చెప్పుకోలేరని, ఆ లక్షణం అమ్మాయిలకు సహజంగానే వచ్చే లక్షణమని అనిల్ తెలిపాడు.
భగవంత్ కేసరిలో ఈ సీనే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. దానికి తోడు బాలకృష్ణ, శ్రీలీల మధ్య ఉన్న బాండింగ్ కు కూడా అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. త్వరలోనే ఈ సినిమాకు అవుట్ డోర్ లో ఓ గ్రాండ్ సక్సెస్ మీట్ ను నిర్వహిస్తామని, ఆ వేడుకలో బాలయ్య కూడా తన అభిప్రాయాలను వెల్లడిస్తాడని అనిల్ తెలిపాడు.













