Anil Ravipudi: ఆ సినిమా లేకపోతే నేను లేను
పటాస్(Pataas) తో డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఇప్పటివరకు చేసిన ప్రతీ సినిమాతో విజయాలను అందుకుంటూ టాలీవుడ్ లో అపజయమెరుగని డైరెక్టర్ గా నిలిచాడు. ఈ ఏడాది ఆల్రెడీ వెంకటేష్(Venkatesh) తో సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమా చేసి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో చేయనున్నాడు.
ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న అనిల్, రీసెంట్ గా కళ్యాణ్ రామ్(Kalyan Ram), విజయశాంతి(Vijayasanthi)తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తనకు పటాస్ తో కెరీర్ ను ఇచ్చిన కళ్యాణ్ రామ్, తన కెరీర్లోనే మంచి హిట్ గా నిలిచిన సరిలేరు నీకెవ్వరు(Sarileru Nikevvaru) లో నటించిన విజయశాంతి కలిసి చేసిన సినిమా కాబట్టి ఇది తన సినిమా కూడా అని ఆ సినిమా ను ప్రమోట్ చేస్తున్నాడు అనిల్.
ఇంటర్వ్యూలో భాగంగా సుమ మీకు పటాస్ ఇష్టమా, సరిలేరు నీకెవ్వరు ఇష్టమా అని అనిల్ ను అడగ్గా, అసలు ఆలోచించుకోకుండా అనిల్ వెంటనే పటాస్ పేరు చెప్పాడు. తనను డైరెక్టర్ గా చేసిన పటాస్ తనకెంతో స్పెషల్ అని, ఆ సినిమా చేయకపోతే తాను డైరెక్టర్ ను అయ్యేవాడిని కాదు కాబట్టి తనకు ఆ సినిమా అంటేనే ఇష్టమని, ఇంకా చెప్పాలంటే పటాస్ లేకపోతే నేను లేనని అనిల్ రావిపూడి చెప్పాడు.













