Suriya: సూర్య మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) వరుస ఫ్లాపులతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. కంగువ(Kanguva), రెట్రో(Retro) సినిమాల డిజాస్టర్లు సూర్యను తీవ్రంగా నిరాశ పరిచాయి. దీంతో ఇప్పుడు తన ఫోకస్ తెలుగు డైరెక్టర్ తో చేస్తున్న సినిమాపై మళ్లింది. ప్రస్తుతం సూర్య, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్(Anil Kapoor) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, సినిమ ఫ్లాష్ బ్యాక్ లో ఆయన కనిపిస్తారని అంటున్నారు. వెంకీ ఇప్పటివరకు రాసుకున్న అన్ని స్క్రిప్టుల్లో ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.
ఈ సినిమాకు విశ్వనాథన్ అండ్ సన్స్(Viswanathan and sons) అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తుండగా, ప్రేమలు(Premalu) భామ మమిత బైజు(Mamitha Byju) ఈ మూవీ లో సూర్యకు జోడీగా కనిపించనుంది. జివి ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందించనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments), ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్(Fortune four cinemas) బ్యానర్లపై నాగవంశీ(naga vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా అయినా సూర్యకు మంచి హిట్ ను అందిస్తుందేమో చూడాలి.







