Andhra King Thaluka: రామోజీ ఫిల్మ్ సిటీలో ఆంధ్రా కింగ్ తాలూకా

ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra King Thaluka). మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) ఫేమ్ పి. మహేష్ బాబు(P Mahesh babu) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర(Upendra) స్టార్ హీరో సూర్య కుమార్ గా కనిపించనుండగా, రామ్ అతనికి డై హార్డ్ ఫ్యాన్ గా కనిపించనున్నాడు.
మొన్నా మధ్య ఈ సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రాజమండ్రి, హైదరాబాద్ లోని కొన్ని ప్రదేశాల్లో జరగ్గా, ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో ఓ స్పెషల్ సెట్ వేయించినట్టు తెలుస్తోంది. రానున్న 10 రోజులు ఈ స్పెషల్ సెట్ లోనే హీరో హీరోయిన్ పై నైట్స్ లో రొమాంటిక్ సీన్స్ ను తెరకెక్కించనున్నారట.
ఆ తర్వాత 20 రోజుల పాటూ క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయనున్నారట. దాదాపు నెలకు పైగా జరగనున్న ఈ లాంగ్ షెడ్యూల్ తో ఆంధ్రా కింగ్ తాలూకాకు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. షూటింగ్ పూర్తైన తర్వాత చిత్ర మేకర్స్ పూర్తి స్థాయి ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్- మార్విన్(Vivek Marvin) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.