Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫ్యాన్ వార్స్, ఫస్ట్ డే ఫస్ట్ ‘పప్పీ షేమ్’ సాంగ్ రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Potineni) మోస్ట్ ఎవైటెడ్, యూనిక్ ఎంటర్‌టైనర్ ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka) ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే తో తన పెన్ పవర్ చూపించారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ పాట అగ్రస్థానంలో కొనసాగుతోంది. బిగ్గెస్ట్ మ్యూజిక్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు,సెకండ్ సింగిల్ పప్పీ షేమ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. రామ్ పోతినేని హై-ఆక్టేన్ వోకల్స్, అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్ హైలైట్ నిలిచింది.
వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ ట్రాక్, ఎనర్జిటిక్ బీట్స్ తో యూత్ అండ్ ఫెస్టివల్ వైబ్‌ను సృష్టిస్తుంది. ఈ పాట రామ్, అతని గ్యాంగ్ తమ అభిమాన స్టార్ చిత్రం విజయంపై ఆనందిస్తున్నప్పుడు, పందెం ఓడిపోయిన యాంటీ-ఫ్యాన్స్‌ను ట్రోల్ చేస్తున్న మూమెంట్ ని ప్రజెంట్ చేస్తోంది.
భాస్కరభట్ల క్యాచి లిరిక్స్ తో వినోదాన్ని, అభిమానుల జ్ఞాపకాలను అద్భుతంగా అందించారు. ఈ ట్రాక్ ముఖ్యంగా ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) మ్యాడ్ నెస్ ని ప్రజెంట్ చేసింది. ఇది రామ్ అభిమానులకే కాకుండా ప్రతి స్టార్ అభిమానులకు ఒక వేడుకగా మారింది.
రామ్ పోతినేని తొలిసారిగా పాడిన ఈ సాంగ్ లో ఆయన వోకల్స్ ఎనర్జీ, ఫన్, వైబ్, కరిజ్మా పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎనర్జిటిక్ బీట్‌లో ఆయన వాయిస్ కలిసిపోతూ ఫెస్టివ్ మూడ్‌ను మరింత ఎలివేట్ చేసింది. విజువల్స్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటూ, రామ్ తన గ్యాంగ్‌తో కలిసి సెలబ్రేషన్ మోడ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించటం ఫ్యాండమ్, స్టార్ మానియాకి అద్దం పడుతుంది.
ఈ చిత్రంలో భగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించగా, సూపర్‌స్టార్‌గా ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ వంటి ప్రముఖ నటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్
ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న “ఆంధ్ర కింగ్ తాలూకా” నవంబర్ 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.