Rashmi Gautham: చాలా లో గా ఉన్నానంటూ రష్మీ పోస్ట్
జబర్దస్త్(Jabardasth) షో తో విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautham). ఆమె గతంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ షో ద్వారానే లైమ్ లైట్ లోకి వచ్చారు. జబర్దస్త్ మాత్రమే కాకుండా పలు టీవీ షోలకు యాంకర్ గా ఉంటున్న రష్మీ ఇప్పుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది.
ఓ నెల రోజుల పాటూ తాను సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు వెల్లడిస్తూ ఓ పోస్ట్ చేశారు. నెల రోజుల పాటూ డిజిటల్ డీటాక్స్ పాటించాలనుకుంటున్నానని, ప్రస్తుతం వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా చాలా లో గా ఉన్నానని, ఇప్పుడు తనకు ఆత్మపరిశీలనవసరమని, అది చేయాలంటే సోషల్ మీడియా ప్రభావం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉంటేనే కుదురుతుందని రష్మీ రాసుకొచ్చింది.
కొన్ని సార్లు సోషల్ మీడియా మన డెసిషన్స్ ను ప్రభావితం చేస్తుందని, అది మన ఆలోచనలపై, మానసిక స్థితిపై చాలా తీవ్రంగా ప్రభావం చూపుతుందని అందుకే నెల రోజుల పాటూ ఈ డిజిటల్ డీటాక్స్ ను పాటించాలనుకుంటున్నానని, తిరిగి చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తానని, మీతో టచ్ లో లేకపోయినా మీ ప్రేమ, సపోర్ట్ ఎప్పటిలానే ఉంటాయని ఆశిస్తున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
https://www.instagram.com/p/DMZflZjyqAJ/?utm_source=ig_web_copy_link







