‘జబర్దస్త్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ లకు మరింత గ్లామర్!
బుల్లితెర సంచలనం `జబర్దస్త్` షో గురించి అందరికీ తెలిసిందే. టీవీ షోల్లో దేనికీ రానంత టీఆర్పి `జబర్దస్త్`కి వచ్చింది. దీంతో ఈ షోకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ షోలో పార్టిసిపేట్ చేసిన ఎంతో మంది సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకున్నారు. `జబర్దస్త్`, `ఎక్స్ట్రా జబర్దస్త్` వచ్చే ఈ రెండు ప్రోగ్రామ్స్‌కి అనసూయ, రష్మీగౌతమ్ యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. జడ్జీలుగా నాగబాబు, రోజా ఉండేవారు. అయితే కొంతకాలం క్రితం నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్నారు.
ప్రస్తుతం ఈ షోకి రోజా, మనో జడ్జీలుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న కారణంగా షూటింగులు లేకపోవడంతో పాత ఎపిసోడ్స్‌నే రిపీట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు తమ గ్లామర్‌తో చలాకీతనంతో, ముచ్చటైన మాటలతో `జబర్దస్త్`, `ఎక్స్ట్రా జబర్దస్త్` షోలను రక్తి కట్టిస్తూ ఆడియన్స్‌ని టీవీలకు కట్టి పడేస్తున్నారు అనసూయ, రష్మీ. ఇప్పుడీ షోలకు మరో హాట్ యాంకర్ రాబోతోందని సమాచారం.
ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మంజుషా `జబర్దస్త్`, `ఎక్స్ట్రా జబర్దస్త్` షోలకు యాంకర్‌గా రాబోతోందట. మంచి అందం, చక్కని మాటతీరు ఉన్న మంజుషా ఈ షోలకు రావడం ఆడియన్స్‌కి పండగనే చెప్పాలి. ఫేస్‌బుక్‌లోనూ, సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే మంజుషా `జబర్దస్త్`, `ఎక్స్ట్రా జబర్దస్త్` షోలతో ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడీ షోలను నడిపిస్తున్న అనసూయ, రష్మీలలో ఒకరు తప్పకునే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. నిజంగా మంజుషా ఈ షోలకు యాంకర్‌గా వస్తే ఆ ఇద్దరిలో ఎవరు తప్పుకుంటారో చూడాలి.













