విజయ్ దేవరకొండ, అనసూయ భరద్వాజ్ ల మధ్య మళ్లీ రేగిన గొడవ?
ఈ రోజు విడుదలైన లైగర్ మూవీ విషయంలో ఇలాంటి రిజల్ట్‌ను ఎవరూ ఊహించలేదు. నెటిజన్స్ సినిమాను ట్రోల్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి ఇది అనుకోని షాక్ అనే అనుకోవాలి. ఈ నేపథ్యంలో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ లైగర్ సినిమా పేరుని ప్రస్తావించకుండా ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ అనసూయ భరద్వాజ్ ల మధ్య 5 ఏళ్లు క్రితం అర్జున్ రెడ్డి సినిమా విషయంలో చేలరేగిన వివాదం మళ్లీ వైరల్ అవుతోంది. విషయం నివురు గప్పిన నిప్పులా ఉండింది. మళ్లీ బయటపడింది. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే. ఇప్పుడు అదే రోజున లైగర్ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది.
‘‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!! #NotHappyOnsomeonesSadness but #FaithRestored ’’ అని అనసూయ ట్వీట్ చేసింది. అసలే తమ హీరో సినిమా పోయిందనే మంటలో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయపై విరుచుకుపడ్డారు. బూతులు తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ‘చరిత్రే చెబుతుంది కదా మేడమ్.. ఆడబిడ్డల జోలికొస్తే పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోయాయి.. మనమెంత’’ అంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు. ఐదేళ్లవుతుందిగా అర్జున్ రెడ్డి సినిమా విషయంలో జరిగిన గొడవను అనసూయ మరచిపోయి ఉంటుందని అనుకుని ఉంటారు. కానీ ఆమె మరచిపోలేదని మరోసారి తన ట్వీట్‌తో స్పష్టం చేసింది. మరి ఈ గొడవపై విజయ్ దేవరకొండ ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి మరి.
https://twitter.com/anusuyakhasba/status/1562730464334725120?cxt=HHwWgIDS5fvE968rAAAA













