రంగమ్మత్త స్పెషల్ సాంగ్ కు బాగానే పుచ్చుకుందే..
కార్తికేయ హీరోగా నటిస్తున్న చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ స్పెషల్ రోల్ గురించి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన స్పెషల్ సాంగ్ లిరిక్, డ్యాన్స్ లను చూశాక.. అనసూయ ఐటెం సాంగ్ లో చెలరేగిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఆ కామెంట్స్ ను అసలు అంగీకరించలేదు అనసూయ. ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్ అనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. చావు కబురు చల్లగా సినిమాకు ఈ సాంగ్ మంచి ఎస్సెట్ అని చెప్పొచ్చు.
3 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ పాట కోసం అనసూయ ఎంత ఛార్జ్ చేసిందనేది ఆరా తీస్తే అక్షరాలా ఈ సాంగ్ కోసం అనసూయ 20 లక్షలు డిమాండ్ చేసిందట. కానీ దాదాపు 15 లక్షల వరకు అనసూయకు ముడుతుందని, దానికి సంబంధించిన ఒప్పందం కూడా ఇప్పటికే ప్రొడక్షన్ హౌన్ తో అనసూయ కుదుర్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా బన్నీ వాసు జీఏ2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు.













