‘రంగస్థలం’లో రంగమ్మత్త ఫస్ట్ లుక్
సుకుమార్, రామ్‌చరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. అనసూయ, జగపతిబాబు, ఆదిపినిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అనసూయ ‘రంగమ్మత్త’ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అనసూయ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ ను అనసూయ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. ‘రంగమ్మత్తను కలవండి’ అని ట్వీట్ చేసింది అనసూయ. రంగమ్మత్త లుక్ లో అనసూయ చాలా బాగుందని, పల్లెటూరి గెటప్ లో సహజంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెట్టేస్తున్నారు.
దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ టాక్ ను సొందం చేసుకున్నాయి. ఆదివారం రాత్రి విడుదల చేసిన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. మార్చి30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 1985లో రంగస్థలం అనే ఊరిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఏంటి? అందులో ఎవరిపై ఎవరు పోరు జరిపారు? అన్న ఇతి వృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు.













