అనసూయకు బంపర్ ఆఫర్
టివి యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను మురిపిస్తున్న అనసూయ సినిమాల్లోనూ నటిస్తూ వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. అయితే ఇప్పుడు అనసూయ ఒక బంపర్ ఆఫర్ దక్కించుకుందట. అది కూడా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసే ఛాన్స్ దక్కించుకుందని తెలిసింది. చిరంజీవి 152వ మూవీగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కోసం అనసూయని సంప్రదించారట. ఇంతకుముందు విన్నర్ సినిమాలో సాయిధరమ్ తేజతో ఆడిపాడిన ఈ బ్యూటీ ఇప్పుడు చిరుతో స్టెప్పులేసే ఛాన్స్ కొట్టేసిందని అందరూ అనుకుంటున్నారు. దీనిపై త్వరలో సృష్టత రానుంది.













