నెగిటివ్ గేమ్ ఆడనున్న రంగమ్మత్త
యాంకర్ మరియు నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ. టీవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ.. ప్రస్తుతం నటిగా బిజీ అవుతుంది. టీవీ ప్రోగ్రామ్స్ తో పాటూ సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ కీలక పాత్రలు చేస్తుంది. గ్లామర్ కూడా ఉంది కాబట్టి స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూంటుంది. చేతినిండా సినిమాలతో ఉన్న అనసూయ ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడీ సినిమాలో కూడా చేస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఖిలాడీ లో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
అందులో మాస్ రాజా రవితేజ ఖిలాడీ సినిమా కూడా ఉంది. ఖిలాడీ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న విషయంలో తెలిసిందే. గత నెలలో తను షూటింగ్ లో పాల్గొంది. మేం మరింత స్మార్ట్ గా ఆడబోతున్నాం. ఎందుకంటే ఈ లేడీ ఒక గేమ్ ఛేంజర్ అంటూ అప్పుడే రమేష్ వర్మ అనసూయ ను ఉద్ధేశించి ట్వీట్ చేసిన విషయం విదితమే. దీంతో ఖిలాడీ లో అనసూయ క్యారెక్టర్ చాలా కీలకమని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం, ఖిలాడీ లో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తుందని టాక్. మరి ఖిలాడీ తో అనసూయ ఎలాంటి గేమ్ ప్లే చేస్తుందో చూడాలంటే మే 28 వరకు ఆగాల్సిందే.













