‘పుష్ప’ చిత్రం లో నటించనని తెగేసి చెప్పిన అనసూయ
అటు బుల్లితెరపై హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ అరకొర సినిమాలు కూడా ఆఫర్లు దక్కించుకుంటూ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా కెరీర్ వున్న అనసూయ సుకుమార్ సినిమా లో నటించనని చెప్పిందంటా! కాని ఎంత జోష్‌లో ఉంటే మాత్రం స్టైలిష్ స్టార్ సినిమాలో నటించడానికి ‘నో’ చెప్పడమేంటి? సినిమా అన్నాక ఒక్కో పాత్ర ఒక్కోలా ఉంటుంది.. అవసరాన్ని బట్టి వేషం మార్చాల్సిందే గానీ ఇలా కుదరదంటే ఎలా? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న పుష్ప సినిమాలో తన వేషం నచ్చలేదని అనసూయ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో ఈ చర్చ ముదిరింది.
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో నటించేందుకు గాను అనసూయ సింపుల్‌గా ‘నో’ చెప్పిందని తెలుస్తోంది. ఇక అందుకు కారణం ఈ మూవీలో ఆమె చేయబోయే క్యారెక్టర్ మేకప్ లేకుండానే డీ గ్లామరస్ రోల్ అని డైరెక్టర్ సుకుమార్ చెప్పడమేనట. ఇది మూవీలో కీలక పాత్ర అయినప్పటికీ మేకప్ లేకుండా నటించడం తన వల్ల కాదని తెగేసి చెప్పిందట ఈ జబర్దస్త్ యాంకర్. ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర ఇచ్చి ఆమె వెండితెర జీవితాన్ని టర్న్ చేసేశాడు సుకుమార్. మరి అలాంటి డైరెక్టర్‌కే అనసూయ నో చెప్పడమేంటనేది అని బన్నీ ఫ్యాన్స్ కోప్పడుతున్నారు.













