స్పైసీ పాత్రలో అనసూయ
రామ్‌చరణ్ రంగస్థలం చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఆ తర్వాత ఈ భామకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఇప్పుడు ఆమే ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో అనసూయ నటించనుంది. ఈ విషయాన్ని కృష్ణవంశీ అధికారికంగా ప్రకటించాడు. ఆమె ఫొటోను ట్వీట్ చేస్తూ… ఎప్పుడూ నవ్వుతూ ఉండే అనసూయతో పనిచేయడం సంతోషంగా ఉంది. ఆమె ఓ స్పైసీ పాత్రలో కనిపించబోతోంది అని ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలో అనసూయ చేతినిండా గాజులు, మెడలో ఆభరణాలు ధరించి చీరలో దర్శనమిచ్చింది. చిరునవ్వులు చిందిస్తున్న ఆమె ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.













