Anasuya Bharadwaj: స్టేజ్ పై చెప్పు తెగుద్దంటూ వార్నింగ్
స్మాల్ స్క్రీన్ యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj). అనసూయ ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. వీటితో పాటూ ఖాళీ టైమ్స్ లో షాప్ ఓపెనింగ్స్, పలు కార్యక్రమాలకు గెస్టుగా హాజరవుతూ ఉంటుంది.
అందులో భాగంగానే అనసూయ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా లోని మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లింది. మాల్ ఓపెనింగ్ తర్వాత అక్కడ స్టేజ్ ఎక్కి ఫ్యాన్స్ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న అనసూయను అక్కడికి వచ్చిన కొందరు అసభ్యకరంగా కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా అనసూయ వారిపై విరుచుకుపడింది.
తాను మాట్లాడుతున్నప్పుడు ఎవరో తనను కామెంట్ చేయడం విన్న అనసూయ అది విని స్టేజ్ పైనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చెప్పు తెగుద్ది. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య లేరా? వారిని కూడా ఇంతే ఏడిపిస్తే ఊరుకుంటారా? వెరీ బ్యాడ్. పెద్ద వాళ్లను ఎలా గౌరవించాలో మీ ఇంట్లో వాళ్లు నేర్పించలేదా అంటూ అనసూయ వారిపై మండిపడగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.







